మధుమేహం లేదా చక్కెర వ్యాధిని వైద్య పరిభాషలో డయాబెటిస్ అంటారు . మధుమేహానికి మూల కారణం క్లోమ గ్రంధి (పాంక్రియాస్) లోని బీటా కణాలు పెరిగిన గ్లూకోజ్ స్థాయిని అరికట్టడానికి సరిపడినంత ఇన్సులిన్ను ఉత్పత్తి చేయలేకపోవడం.
టైప్-1 మధుమేహం ఎవరికి వస్తుంది?
ఈ వ్యాధి పెద్దలలో గానీ పిల్లలోగాని ఎవరిలోనైనా రావచ్చు. కానీ సాంప్రదాయకంగా చిన్న పిల్లలలో
వచ్చే ఈ మధుమేహాన్ని జువైనల్ డయాబెటిస్ అంటారు.
టైప్-1 మధుమేహం ఎందుకు వస్తుంది?
మన శరీరంలోనికి కొన్ని వ్యాధి కారక క్రిములు ప్రవేశించినప్పుడు లేదా ఇన్ఫెక్షన్ సోకినప్పుడు వాటిని తెల్ల రక్త కణాల నుంచి తయారయ్యే యాంటీబాడీస్ నాశనం చేస్తాయి. ఈ యాంటీబాడీస్ ఒక్కోసారి మన శరీరంలోని కణాల మీద దాడి చేయడం వలన బీటా కణాలు నాశనం కావడం దానితో ఇన్సులిన్ ఉత్పత్తి ఆగిపోవడం జరుగుతుంది. ఫలితంగా రక్తంలోని గ్లూకోజ్ ను నియంత్రించే యంత్రాంగం లేక టైప్ 1 మధుమేహం వస్తుంది. దీన్నిబట్టి టైప్ 1 మధుమేహం సాధారణంగా బీటా కణాలను మన శరీరం స్వయంగా నాశనం చేయడం (ఆటోఇమ్యూనిటీ) వల్ల కలుగుతుందని గ్రహించవచ్చు.
వ్యాధి లక్షణాలు :
1.అతిగా మూత్రం రావడం
2.అతిగా దాహం వేయడం
3.అతిగా ఆకలి వేయడం
4. బరువు తగ్గడం
5.అలసట
6.నీరసం
7.శ్వాస వేగంగా పీల్చుకోవడం
8.కడుపులో నొప్పి మొదలైనవి.
తీసుకోవలసిన జాగ్రత్తలు:
1.క్రమం తప్పకుండా ఇన్సులిన్ తీసుకోవడం
2.సరైన సమయంలో ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం
- ధాన్యపు ఉత్పత్తులతో చేసిన ఆహారానికి ప్రాధాన్యత నివ్వాలి. దంపుడు బియ్యం, గోధుమ పిండి వాడాలి
- ఆకుకూరలు,మొలకలు,సలాడ్లుఆహారంలో భాగంగా ఉండాలి.
- తీపి పదార్థాలకు, కొవ్వును పెంపొందించే ఆహారాలకు దూరంగా ఉంటే మంచిది
3. రోజువారీ వ్యాయామం చేయడం
4. గ్లూకోజ్ నియంత్రణ కోసం వైద్యుల సలహాలను పాటించడం
Отличия обычной и упрощенной системы налогообложения
налог усн http://www.tb-usn1.ru.