Blog Detail

టైప్-1 మధుమేహం (Information on Type 1 Diabetes in Telugu)

మధుమేహం లేదా చక్కెర వ్యాధిని వైద్య పరిభాషలో డయాబెటిస్ అంటారు . మధుమేహానికి మూల కారణం క్లోమ గ్రంధి (పాంక్రియాస్) లోని బీటా కణాలు పెరిగిన గ్లూకోజ్ స్థాయిని అరికట్టడానికి సరిపడినంత ఇన్సులిన్ను ఉత్పత్తి చేయలేకపోవడం.

టైప్-1 మధుమేహం ఎవరికి వస్తుంది?

ఈ వ్యాధి పెద్దలలో గానీ పిల్లలోగాని ఎవరిలోనైనా రావచ్చు.  కానీ సాంప్రదాయకంగా చిన్న పిల్లలలో

వచ్చే ఈ మధుమేహాన్ని జువైనల్ డయాబెటిస్ అంటారు.

టైప్-1 మధుమేహం ఎందుకు వస్తుంది?

మన శరీరంలోనికి కొన్ని వ్యాధి కారక క్రిములు ప్రవేశించినప్పుడు లేదా ఇన్ఫెక్షన్ సోకినప్పుడు వాటిని తెల్ల రక్త కణాల నుంచి తయారయ్యే యాంటీబాడీస్ నాశనం చేస్తాయి. ఈ యాంటీబాడీస్   ఒక్కోసారి మన శరీరంలోని కణాల మీద దాడి చేయడం వలన బీటా కణాలు నాశనం కావడం దానితో ఇన్సులిన్ ఉత్పత్తి ఆగిపోవడం జరుగుతుంది. ఫలితంగా రక్తంలోని గ్లూకోజ్ ను నియంత్రించే యంత్రాంగం లేక  టైప్ 1 మధుమేహం వస్తుంది. దీన్నిబట్టి టైప్ 1 మధుమేహం సాధారణంగా బీటా కణాలను మన శరీరం స్వయంగా నాశనం చేయడం (ఆటోఇమ్యూనిటీ) వల్ల కలుగుతుందని గ్రహించవచ్చు.

వ్యాధి లక్షణాలు :

1.అతిగా మూత్రం రావడం

2.అతిగా దాహం వేయడం

3.అతిగా ఆకలి వేయడం

4. బరువు తగ్గడం

5.అలసట

6.నీరసం

7.శ్వాస వేగంగా పీల్చుకోవడం

8.కడుపులో నొప్పి మొదలైనవి.

తీసుకోవలసిన జాగ్రత్తలు:

1.క్రమం తప్పకుండా ఇన్సులిన్ తీసుకోవడం

2.సరైన సమయంలో ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం

  • ధాన్యపు ఉత్పత్తులతో చేసిన ఆహారానికి ప్రాధాన్యత నివ్వాలి. దంపుడు బియ్యం, గోధుమ పిండి వాడాలి
  • ఆకుకూరలు,మొలకలు,సలాడ్లుఆహారంలో భాగంగా ఉండాలి.
  • తీపి పదార్థాలకు,  కొవ్వును పెంపొందించే ఆహారాలకు దూరంగా ఉంటే మంచిది

3. రోజువారీ వ్యాయామం చేయడం

4. గ్లూకోజ్ నియంత్రణ కోసం వైద్యుల సలహాలను పాటించడం

Please follow and like us:
0 Comment

Leave a Comment

Your email address will not be published.

WhatsApp chat
error

Enjoy this blog? Please spread the word :)

Follow by Email
Instagram